నేపాల్‌లో కొత్త పౌరసత్వ చట్టం.. 15 లక్షల మందికి ఊరట..!

ABN , First Publish Date - 2022-07-24T01:35:42+05:30 IST

నేపాల్ పౌరసత్వం కోసం వేచి చూస్తున్న 15 లక్షల మందికి ఊరటనిచ్చేలా పౌరసత్వచట్టాని(Citizenship bill) సవరణలు చేస్తూ నేపాల్ పార్లమెంట్(Nepal parliament) కొత్త బిల్లుపై ఆమోద ముద్ర వేసింది.

నేపాల్‌లో కొత్త పౌరసత్వ చట్టం.. 15 లక్షల మందికి ఊరట..!

ఎన్నారై డెస్క్: నేపాల్ పౌరసత్వం కోసం వేచి చూస్తున్న 15 లక్షల మందికి ఊరటనిచ్చేలా పౌరసత్వచట్టాని(Citizenship act) సవరణలు చేస్తూ నేపాల్ పార్లమెంట్(Nepal parliament) కొత్త బిల్లుపై ఆమోద ముద్ర వేసింది. పౌరసత్వ చట్టం-2006కు సవరణలు ప్రతిపాదిస్తూ హోం మంత్రి బాలకృష్ణ ఖండ్ శుక్రవారం దిగువ సభలో బిల్లు ప్రవేశపెట్టగా.. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటువేశారు. తదుపరి ఈ బిల్లుపై నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. పార్లమెంటులో ఈ బిల్లు పాసైన అనంతరం.. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. 


ఇప్పటివరకూ ఉన్న నేపాల్  పౌరసత్వ చట్టం ప్రకారం.. నేపాల్‌లో జన్మించిన కారణంగా అక్కడి పౌరులైన వారి సంతానం ఆ దేశ పౌరసత్వం పొందేందుకు అవకాశం ఉండేది కాదు. అయితే..తాజాగా చట్టం ఇందుకు అవకాశం కల్పిస్తోంది. పౌరసత్వం లేని కారణంగా ఇప్పటివరకూ నేపాల్‌లో దాదాపు 15 లక్షల మంది పలు అవస్థలు పడుతున్నారు. వారికి పౌరసత్వం కల్పించే చట్టమేదీ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే.. పార్లమెంట్ తాజా నిర్ణయంతో ఇలాంటి వారందరూ సంబరాలు చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా ప్రతినిధుల సభలో ఈ బిల్లుపై చర్చలు సాగుతున్నప్పటికీ..రాజకీయ పార్టీ మధ్య ఏకాభ్రిప్రాయం ఇంతవరకూ కుదరలేదు. తాజాగా ప్రతినిధుల సభ్యులు సింపుల్ మెజారిటీతో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. 

Updated Date - 2022-07-24T01:35:42+05:30 IST