రాజ్యాంగ సవరణ దిశగా నేపాల్! భారత భూభాగం తమదిగా చూపేందుకు..

ABN , First Publish Date - 2020-06-07T18:04:08+05:30 IST

భారత భూభాగాలైన కాలాపానీ, లిపూలేఖ్, లింపియదూర ప్రాంతాలను నేపాల్‌‌కు చెందినవిగా చూపించే కొత్త మ్యాపుకు రాజ్యంగ పరపతి కల్పిచేందుకు నేపాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

రాజ్యాంగ సవరణ దిశగా నేపాల్! భారత భూభాగం తమదిగా చూపేందుకు..

ఖాట్మండూ: భారత భూభాగాలైన కాలాపానీ, లిపూలేఖ్, లింపియదూర ప్రాంతాలను నేపాల్‌‌కు చెందినవిగా చూపించే కొత్త మ్యాపుకు రాజ్యంగ పరపతి కల్పిచేందుకు నేపాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా నేపాల్ రాజ్యాంగంలో మార్పులు చేసే బిల్లుపై ప్రతినిధుల సభలో జూన్ 9న వోటింట్ జరగనుంది. నేపాల్ న్యాయశాఖ మంత్రి ఈ రాజ్యాంగ సవరణ బిల్లును మే 31న సభలో ప్రవేశపెట్టారు. భారత్ భూభాగాలను నేపాల్‌లో చేర్చుతూ మ్యాపును తాజా పరిచేందుకు ఉద్దేశించిన ఈ సవరణను అక్కడ ప్రభుత్వం మే 22న ప్లార్లెమెంటు‌లో నమోదు చేసింది. అయితే రాజ్యంగ సవరణకు ఆమోదం తెలిపేందుకు 66 శాతం  సభ్యుల మద్దతు అవసరమవుతుంది. నేపాల్‌లో అధికారంలో ఉన్న కమ్యునిష్టు పార్టీకి ఎగువ సభలో ఈ సవరణకు సరిపడా సభ్యులు ఉన్నప్పటికీ ప్రతినిధుతుల సభలో మాత్రం లెక్కలు తారుమారయ్యాయి. దీంతో అధికార పక్షానికి దిగువ సభలో ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. అయితే ఈ సవరణ బిల్లుపై మరింత చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో కేపీ శర్మా ఓలీ ప్రభుత్వం ఈ విషయాన్ని మే 27 వరకూ వాయిదా వేసింది. ఈ క్రమంలో మే 30న నేపాలీ కాంగ్రెస్ సవరణ బిల్లుకు మద్దతు తెలపడంతో బిల్లుకు కావాల్సిన సభ్యుల మద్దతు లభించినట్టైంది. దీంతో రాజ్యంగ సవరణకు నేపాల్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోయాయి. 

Updated Date - 2020-06-07T18:04:08+05:30 IST