అత్యాచారం కేసు పెట్టేందుకు 800 కిలోమీటర్ల ప్రయాణం!

ABN , First Publish Date - 2020-10-05T23:45:08+05:30 IST

అత్యాచారం కేసు నమోదు చేసేందుకు ఓ మహిళ ఏకంగా 800 కిలోమీటర్ల ప్రయాణించింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటున్న తన స్నేహితురాలి వద్దకు వచ్చి, ఆమె సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అత్యాచారం కేసు పెట్టేందుకు 800 కిలోమీటర్ల ప్రయాణం!

నాగ్‌పూర్: అత్యాచారం కేసు నమోదు చేసేందుకు ఓ మహిళ ఏకంగా 800 కిలోమీటర్ల ప్రయాణించింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటున్న తన స్నేహితురాలి వద్దకు వచ్చి, ఆమె సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా అధికారులు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. పోలీసులను ఆశ్రయించవద్దంటూ నిందుతుడు బెదిరించడంతో ఆమె మహారాష్ట్రలో ఉన్న స్నేహితురాలి సహాయం తీసుకుందని వారు తెలిపారు. 


బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమె 2018లో ఉద్యోగం కోసం భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో తన వెంట రూ. 1.5 లక్షల నగదును కూడా తెచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని తన స్నేహితురాలి రూంలో నివసించ సాగింది. తన డబ్బును కూడా ఆమె వద్దే దాచుకుంది. ఈ క్రమంలో.. స్నేహితురాలు ఆమెకు రాజ్‌పాల్ జాదవ్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. అతడు దుబాయ్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 


ఇదిలా ఉండే.. ఓ రోజు బాధితురాలు తన డబ్బు తిరిగివ్వాలని  స్నేహితురాలిని కోరగా.. ఆమె నిరాకరించింది. ఏం చేయాలో పాలుపోక ఆమె రాజ్‌పాల్ యాదవ్‌ను సంప్రదించింది. సమస్యను ఏదోలా పరిష్కరిద్దామని చెప్పిన అతడు.. ఆమె తాత్కాలికంగా నివసించేందుకు ఓ హోటల్ రూం బుక్ చేశాడు. తరవాత.. ఆ  గదికి వచ్చిన ఆమెకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. త్వరలో కేసు ఉత్తరప్రదేశ్‌కు బదిలీ చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-05T23:45:08+05:30 IST