Nepal plane ప్రమాదంలో నలుగురు మహారాష్ట్రవాసుల అదృశ్యం

ABN , First Publish Date - 2022-05-30T14:39:42+05:30 IST

నేపాల్ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు....

Nepal plane ప్రమాదంలో నలుగురు మహారాష్ట్రవాసుల అదృశ్యం

కాట్మూండూ(నేపాల్): నేపాల్ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. మహారాష్ట్రలోని థానేకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆదివారం నేపాల్ విమాన ప్రమాదంలో గల్లంతయ్యారు. నేపాల్‌లోని ప్రైవేట్ ఎయిర్‌లైన్ తారా ఎయిర్ విమానంలో ఆదివారం తప్పిపోయిన 22 మందిలో మహారాష్ట్ర వారున్నారు. విమాన శిథిలాలను ముస్తాంగ్‌లోని కోవాంగ్‌లో కనుగొన్నారు.అదృశ్యమైన ప్రయాణికుల్లో 54 ఏళ్ల అశోక్ త్రిపాఠి, అతని భార్య వైభవి బాండేకర్-త్రిపాఠి(51), కుమారుడు ధన్యస్య త్రిపాఠి(22), కుమార్తె రితికా త్రిపాఠి (18)గా గుర్తించారు. థానేలోని రుస్తోమ్‌జీ ఎథీనా భవనంలో నివసిస్తున్న త్రిపాఠి కుటుంబం హాలిడే కోసం నేపాల్‌ పర్యటనకు వెళ్లి అదృశ్యమయ్యారు. 


మిస్సింగ్ అయిన నేపాల్ విమానం ముస్తాంగ్ జిల్లాలో కనిపించింది.విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికులు అదృశ్యమైనట్లు నేపాల్‌లోని కపూర్‌బావడి పోలీసులు ధృవీకరించారు.హిమపాతం కారణంగా ఆదివారం సెర్చ్ ఆపేశారు. నేపాల్ ఆర్మీ సోమవారం ఉదయం తిరిగి సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది.తప్పిపోయిన నేపాల్ విమానంలో బీహార్‌కు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని సైనికులు భౌతికంగా గుర్తించారు.విమానం క్రాష్ సైట్లో 19 మంది ప్రయాణికులను గుర్తించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.విమాన సిబ్బందిలో కెప్టెన్ ప్రభాకర్ ఘిమిరేలే, ఫ్లైట్ ఆపరేటర్ కిస్మి థాపా, సిబ్బంది అర్కా, ఉత్సవ్ పోఖరెల్లె ఉన్నారు.


తప్పిపోయిన ప్రయాణికులు ఇంద్ర బహదూర్ గోలే, పురుషోత్తం గోలే, రాజన్‌కుమార్ గోలే, మైక్ గ్రీట్ గ్రాఫ్, బసంత్ లామా, గణేష్ నారాయణ్ శ్రేష్ఠ, రవీనా శ్రేష్ఠ, రష్మీ శ్రేష్ఠ, రోజినా శ్రేష్ఠ, ప్రకాష్ సునువార్, మకర్ బహదూర్ తమల్, సుకుల్స తమల్, సుకుల్స తమల్, సుకుల్స తమల్ , అశోక్ కుమార్ త్రిపాఠి , ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, ఉవే విల్నర్, వైభవి బాండేకర్ లున్నారని నేపాల్ అధికారులు వివరించారు.


Updated Date - 2022-05-30T14:39:42+05:30 IST