Abn logo
May 4 2021 @ 13:08PM

ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి

నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం గోల్లకందుకురు సమీపంలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘటనాస్థలికి పరిశీలించారు. మృతులు పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), అబ్బుకోటి పెంచాలయ్య(60), తాంధ్రా వెంకతరమనమ్మ(19)గా గుర్తించారు. వీళ్లంతా పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి ఐదుగురు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement