కండలు తిరిగిన శరీరం.. ఆరడగుల ఆజానుబాహువుకు గుండెపోటా..!?

ABN , First Publish Date - 2022-02-22T12:29:06+05:30 IST

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్రమైన గుండెపోటుతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ..

కండలు తిరిగిన శరీరం.. ఆరడగుల ఆజానుబాహువుకు గుండెపోటా..!?

నెల్లూరు : ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్రమైన గుండెపోటుతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.30 గంటలకే ఈ వార్త జిల్లా ప్రజలకు తెలిసినా తొలువ ఎవరూ విశ్వసించలేదు. కండలు తిరిగిన శరీరంతో చలాకీగా కనిపించే ఆరడగుల ఆజానుబాహువుకు గుండెపోటు ఏమిటి..? అని ఆశ్చర్యపోయారు. అయితే కొన్ని నిమిషాలకే  గౌతమ్‌రెడ్డి  ఇక లేరు.. అనే చేదు నిజాన్ని తెలుసుకొని విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో మేకపాటి గౌతంరెడ్డిది ప్రత్యేక శైలి. ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని తిట్టిపోయడం, తమవారు కాదనుకున్న వారిపై అధికార దర్పంతో దాడులు చేయించడం ప్రధాన అర్హతలుగా చెలామణి అవుతున్న ఈ రోజుల్లో అలాంటి పోకడలు మచ్చుకైనా కనిపించని నాయకుడిగా  మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2022-02-22T12:29:06+05:30 IST