Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బ్లాక్ టికెట్స్ అమ్మడంలో వైసీపీదే హవా..

twitter-iconwatsapp-iconfb-icon
బ్లాక్ టికెట్స్ అమ్మడంలో వైసీపీదే హవా..

నెల్లూరు జిల్లా: వైసీపీ శ్రేణులు సినిమాలను వదలడంలేదు. ఏ సినిమా విడుదల అయితే ఆ హీరో అభిమానులమని అంటున్నారు. టిక్కెట్లు అన్నీ వారు సొంతం చేసుకుని అధికధరలకు విక్రయిస్తూ లక్షలకు లక్షలు సొమ్ముచేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా, కావలిలో సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిరు, నందమూరి అభిమానులమని చెబుతూ థియేటర్ల వద్దకు ఎవరినీ రానీయకుండా పెత్తనం చెలాయించారు. సినిమా టిక్కెట్లు తగ్గాంచామని ప్రభుత్వం గొప్పలకు పోతుంటే.. వైసీపీ శ్రేణులే బ్లాకులో ఒక్కో టిక్కెట్ రూ. 2 వేలకు అమ్మారు.


అలాగే విజయనగరం జిల్లాలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో వైసీపీ నేతలు నానా హంగామా చేస్తున్నారు. చీపురుపల్లిలో ఐదు థియేటర్లకు చెందిన ప్రదర్శన టిక్కెట్లను ఎంపీ చంద్రశేఖర్ కొడుకు వంశీకృష్ణ టిక్కెట్లు తీసుకున్నాడు. బ్లాక్‌లో భారీ ధరలకు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని వైసీపీ నేతల తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.