నెల్లూరు జిల్లా: పెన్నానది ఉధృతితో కొన్ని రోజుల క్రితం తీర ప్రాంతంలోని ప్రజలు భయానక పరిస్థితులు చవిచూశారు. వరద ముంపు తగ్గిన తర్వాత వరదల్లో కొట్టుకొచ్చిన వస్తువులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందుకూరుపేట మండలం, ముదివర్తిపాలెంలో నాగరాజు అనే రైతు తన రొయ్యల గుంటలను శుభ్రపరుస్తుండగా కొన్ని బీరువాలు, ఒక మోటార్ బైక్ లభ్యమయ్యాయి. ఎవరి బీరువాలు వారు తీసుకుపోగా, బైక్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.