నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న వరద ఉధృతి..కలకత్తా చెన్నై రహదారికి గండి..

ABN , First Publish Date - 2021-11-21T16:30:08+05:30 IST

నెల్లూరు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. పడుగుపాడు సమీపంలో కలకత్తా-చెన్నై జాతీయ రహదారికి గండిపడింది. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న వరద ఉధృతి..కలకత్తా చెన్నై రహదారికి గండి..

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. పడుగుపాడు సమీపంలో కలకత్తా-చెన్నై జాతీయ రహదారికి గండిపడింది. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ముంపుకి గురైన యాభై గ్రామాలు నగరంలోని పలు ప్రాంతాలు మునగడంతో పునరావాస కేంద్రాల్లో వసతులు, భోజనాలు సరిలేక ఇబ్బందులు పడుతున్నారు. మరొపక్క పడుగుపాడు వద్ద రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు రావడంతో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. శనివారం నుంచి పలు స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2021-11-21T16:30:08+05:30 IST