Nellore: ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

ABN , First Publish Date - 2022-05-11T17:33:32+05:30 IST

Nellore: ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.

Nellore: ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

Nellore: ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. బైక్ (Bike) యాక్సిడెంట్‌కు గురై తీవ్రగాయాలతో అధ్యాపకుడు రామకృష్ణ,  చిరంజీవి అనే మరో వ్యక్తి ఆస్పత్రికి వచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వారికి చికిత్స చేశారు. తలకి కట్లు కట్టడం, సెలైన్లు పెట్టడం అంత సెక్యూరిటీ గార్డులు, స్వీపరులే చేశారు. డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ  కేవలం ఇంజక్షన్ వేసి సరిపెట్టుకున్నాడు. కాగా లెక్చరర్ రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Read more