అర్ధరాత్రి నడిరోడ్డుపై అంగన్‌వాడీ వర్కర్లను కూర్చోబెట్టిన పోలీసులు

ABN , First Publish Date - 2022-04-24T19:57:24+05:30 IST

నెల్లూరు జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్లు అనుమతి తీసుకుని ...

అర్ధరాత్రి నడిరోడ్డుపై అంగన్‌వాడీ వర్కర్లను కూర్చోబెట్టిన పోలీసులు

నెల్లూరు: జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్లు అనుమతి తీసుకుని విజయవాడలో జరుగుతున్న సభకు వెళుతున్నామని చెప్పినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి నడిరోడ్డుపై మహిళలను కూర్చోబెట్టారు. మహిళా పోలీసులు కూడా లేరని అంగన్‌వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడకు నెల్లూరు జిల్లా నుంచి 30 బస్సులకుపైగా బయలుదేరాయి. అందరూ అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. 


అంగన్‌వాడీ వర్కర్ల  సంక్షేమ సంఘం ఆవిర్భావ దినోత్సం వేడుకలు విజయవాడలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్లకు సంబంధించిన సమస్యలపై చర్చించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అంగన్‌వాడీ వర్కర్లు వస్తున్నారు. నెల్లూరు జల్లా నుంచి 30 బస్సుల్లో అంగన్‌వాడీ వర్కర్లు విజయవాడకు వస్తుండగా రెండు బస్సులను మాత్రం పెళ్లకూరు మండలం, దిగువ చావలి జాతీయ రహదారిపై పోలీసులు అర్ధరాత్రి సమయంలో అడ్డుకున్నారు. దీంతో మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు. తమను ఇక్కడి నుంచి పంపించకపోతే విజయవాడలో సమావేశం అయ్యేంతవరకు నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-24T19:57:24+05:30 IST