Abn logo
Aug 26 2021 @ 12:36PM

హెచ్‌ఎం వేధింపులు తాళలేక ఆయా ఆత్మహత్యాయత్నం

నెల్లూరు: పాఠశాల ఇన్చార్జ్ హెచ్‌ఎం వేధింపులు తాళలేక ఆయా ఆత్మహత్యాయత్నం చేసింది. నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలం, మనగ్రామంలో ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఆయాగా పనిచేసే నీలమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మినగల్లుకు చెందిన నీలమ్మ గత నాలుగేళ్లుగా అనారోగ్యం కారణంగా విధులకు హాజరుకాలేదు. అనారోగ్యం నుంచి కోలుకుని.. తిరిగి విధులకు హాజరవుతున్న తనను హెచ్‌ఎం రవీంధ్ర శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపింది. కుటుంబసభ్యులు గమనించి సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

క్రైమ్ మరిన్ని...