ATMAKUr ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్

ABN , First Publish Date - 2022-06-04T18:56:04+05:30 IST

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ATMAKUr ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు.వైసీపికి దమ్ముంటే ఓట్లు కొనకుండా స్వచ్ఛందంగా ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. టీడీపికి స్థిరమైన సిద్ధాంతం లేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి చేతనయితే మంత్రులను ఎన్నికల ప్రచారంలోకి దింపకుండా కేవలం అభ్యర్థులే ప్రచారంలో పాల్గొని లక్ష మెజారిటీతో గెలుపొందాలన్నారు. 

Updated Date - 2022-06-04T18:56:04+05:30 IST