Nellore: తండ్రి ఘాతుకానికి గాయపడిన చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-06-16T13:54:21+05:30 IST

కన్న తండ్రి ఘాతుకానికి గాయపడి ఆసుపత్రిపాలైన చిన్నారి పునర్విక మృతి చెందింది.

Nellore: తండ్రి ఘాతుకానికి గాయపడిన చిన్నారి మృతి

నెల్లూరు: కన్న తండ్రి ఘాతుకానికి గాయపడి ఆసుపత్రిపాలైన చిన్నారి పునర్విక మృతి  చెందింది. ఆత్మకూరు పేరారెడ్డిపల్లిలో పూజల పేరుతో తండ్రి వేణు... కుమార్తె పునర్విక నోట్లో కుంకుమ కూరి గొంతు నులిమాడు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. జిల్లాలోని ఆత్మకూరు పేరారెడ్డిపల్లిలో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకని కసాయి తండ్రి వేణును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-16T13:54:21+05:30 IST