సోమశిల, కండలేరు డ్యామ్‌లకు వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-09-30T15:57:53+05:30 IST

జిల్లాలోని సోమశిల, కండలేరు డ్యామ్‌‌లకు వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది.

సోమశిల, కండలేరు డ్యామ్‌లకు వరద ప్రవాహం

నెల్లూరు: జిల్లాలోని సోమశిల, కండలేరు డ్యామ్‌‌లకు వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. సోమశిల డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 78టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 73.7998 టీఎంసీలుగా ఉంది. అలాగే ఇన్ ఫ్లో 42,204 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 450 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అటు కండలేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 47.372 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఇన్ ఫ్లో 10,392 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2350 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-09-30T15:57:53+05:30 IST