Abn logo
Sep 20 2020 @ 10:40AM

పెన్నానది ఉగ్రరూపం

నెల్లూరు: పెన్నానది ఉగ్రరూపంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంజనీర్ల అవగాహనరాహిత్యంతో ఒక్కసారిగా పైఎత్తు నుంచి వచ్చే నీటి మొత్తాన్ని‌ దిగువకి వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెన్నా నదిలో 1,50,000 క్యాసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. దీంతో పెన్నానది వెంబడి ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement