నెల్లూరులో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-06-20T15:21:15+05:30 IST

జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి వద్ద ఓ హైరర్స్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

నెల్లూరులో అగ్ని ప్రమాదం

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి వద్ద ఓ హైరర్స్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో షాపులోకి వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అగ్నిప్రమాదంలో దాదాపు రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2021-06-20T15:21:15+05:30 IST