కాబోయే వరుడికి అశ్లీల వీడియో పంపిన వధువు ప్రియుడు.. ఆ ప్రియుడు గురించి ఆరా తీయగా షాకింగ్ నిజాలు

ABN , First Publish Date - 2022-05-09T09:32:24+05:30 IST

పొరుగింట్లో ఉండే చుట్టాలబ్బాయి ఒక యువతిపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనని మొబైల్‌లో వీడియో కూడా తీశాడు. ఆ తర్వాత వీడియో వైరల్ చేసేస్తానని బెదిరించి, ఆ యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా ఆ యువతికి వేరే పెళ్లి సంబంధం తెచ్చిన కుటుంబం పెళ్లి నిశ్చయం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు యువకుడు.. పెళ్లి కొడుకు మొబైల్‌కు తన వద్ద ఉన్న వీడియో పంపాడు...

కాబోయే వరుడికి అశ్లీల వీడియో పంపిన వధువు ప్రియుడు.. ఆ ప్రియుడు గురించి ఆరా తీయగా షాకింగ్ నిజాలు

పొరుగింట్లో ఉండే చుట్టాలబ్బాయి ఒక యువతిపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనని మొబైల్‌లో వీడియో కూడా తీశాడు. ఆ తర్వాత వీడియో వైరల్ చేసేస్తానని బెదిరించి, ఆ యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా ఆ యువతికి వేరే పెళ్లి సంబంధం తెచ్చిన కుటుంబం పెళ్లి నిశ్చయం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు యువకుడు.. పెళ్లి కొడుకు మొబైల్‌కు తన వద్ద ఉన్న వీడియో పంపాడు. దీంతో ఆ కుటుంబంలో కలకలం రేగింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌లో వెలుగు చూసింది. 


స్థానికంగా నివశించే దేవ్ కుమార్ అనే యువకుడు.. ఏడాదిన్నర క్రితం కాలేజీలో చదువుకుంటున్న చుట్టాలమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఆమెకు పెళ్లి కుదిరిందని తెలిసి, వరుడికి ఆ వీడియో పంపి సంబంధం చెడగొట్టాడు. 


దీనిపై పంచాయితీ పెట్టినా తన తప్పు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలిసిన దేవ్ కుమార్ ఇంటి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Read more