Advertisement

ఆమె అంటీ... మరి నువ్వు ఏంటి?

బిగ్ బాస్ ఎక్కడైనా బిగ్ బాసే. వివాదాలు లేకుంటే అసలు మజా ఏముంటుంది? ఆ విధంగా ఫీలైపోయే... కంటెస్టెంట్స్ చాలా రకాల కాంట్రవర్సీలకు తెర తీస్తుంటారు. ఇది తెలుగు బిగ్ బాస్‌కే కాదు హిందీ బిగ్ బాస్‌కు కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ నానా రచ్చ చేసేస్తుంటారు. అలాంటి తొందర్లోనే, తాజాగా కరణ్ కుంద్రా ‘ఆంటీ’ అనేశాడు. ఎవర్నీ అంటారా... శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టిని! 


షమితా శెట్టిని ‘ఆంటీ’ అన్న కరణ్ కుంద్రాపై బాలీవుడ్ సింగర్ నేహా భసిన్ సీరియస్ అయింది. ‘‘కరణ్ కుంద్రా నువ్వు కాస్త మానసికంగా ఎదగాలి. షమితా శెట్టిని ఊరికే టార్గెట్ చేయటం మానేయాలి’’ అందామె. అంతే కాదు, నేహా తన సోషల్ మీడియా  అకౌంట్లో... ‘‘కాస్త వయసు వచ్చిన మహిళల్ని ‘ఆంటీ‘ అంటూ పిలవటం వార్ని ఉద్దేశ్యపూర్వకంగా వెక్కిరించటమే అవుతుంది. ముందు అసలు నీ వయస్సే 37 ఏళ్లు’’ అంటూ వ్యాఖ్యానించింది.

Advertisement

Bollywoodమరిన్ని...