వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-08-11T04:49:28+05:30 IST

రోగులకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స హించేది లేదని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేం దర్‌రెడ్డి హెచ్చరించారు.

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు
మద్దూర్‌ ఆసుపత్రిలో సంఘటన వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

- మద్దూర్‌ ఆసుపత్రిలో తల్లీబిడ్డ మృతి సంఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం

మద్దూర్‌, ఆగస్టు 10 : రోగులకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స హించేది లేదని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేం దర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మద్దూర్‌ ప్రభు త్వ ఆసుపత్రిని తనిఖీ చేసి ఆసుపత్రిలో కాన్పు సం దర్భంగా ఇటీవల మృతి చెందిన తల్లీబిడ్డ సంఘట నపై సిబ్బందిని మందలించారు. క్రిటికల్‌ కేసులను జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ చేయాలని సిబ్బందికి సూ చించారు. గర్భిణికి వైద్య సేవలందించిన స్టాఫ్‌ న ర్సును అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఆసు పత్రిలో అవసరమైన గైనకాలజిస్టు, అనస్థియాను వెంటనే  నియమించాలిని ఉత్నతాధికారుకు ఫోన్‌ లో సూచించారు. నూతన ఆసుపత్రి ప్రారంభం నా టి నుంచి ఎన్ని కాన్పులు చేశారని అడగగా 16 కా న్పులు నార్మల్‌గా చేశామని తెలిపారు. అంతకు ముందు తిమ్మారెడ్డిపల్లిలోని బాధిత కుటుంబీకుల ను పరామర్శించారు. సర్పంచ్‌ అరుణ, మాజీ జడ్పీ టీసీ సభ్యుడు బాల్‌సింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటయ్య, నాయకు లు శివకుమార్‌, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు వీఆర్వోల వినతి

సమస్యలు పరిష్కరించాలని వీఆర్వఓలు ఎమ్మె ల్యేకు వినతిపత్రం అందించారు. తమ నియామకం పట్ల ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు.

Updated Date - 2022-08-11T04:49:28+05:30 IST