‘చెరువు’ను మింగాము... హైదరాబాద్ మునుగుతోంది..

ABN , First Publish Date - 2020-10-19T21:36:33+05:30 IST

హైదరాబాద్ లో వర్షం కురిస్తే... సముద్రం కనిపిస్తుంది. వందల్లోజనాలు ప్రాణాలు కోల్పోతారు. పిల్లలకు పాలు, నిత్యావసర సరుకులు కూడా దొరకవు. అదే మామూలు రోజుల్లోనైతే...హైదరాబాద్ అంటే... ఓ మహా నగరం. ప్రపంచ చరిత్రలో... హౌదరాబాద్ ఓ వరల్డ్ క్లాస్ సిటీ. కానీ వర్షలు పడితే... మహానగరం కాస్తా.. ఓ మహాసముద్రమైపోతుంది. ఎవరిది తప్పు ? హైదరాబాద్ ఎందుకు ఫ్లడ్ మనేజ్‌మెంట్లో విఫలమవుతోంది ? అనేదే ఈ గ్రౌండ్ రిపోర్ట్.

‘చెరువు’ను మింగాము... హైదరాబాద్ మునుగుతోంది..

హైదరాబాద్ : హైదరాబాద్ లో వర్షం కురిస్తే... సముద్రం కనిపిస్తుంది. వందల్లోజనాలు ప్రాణాలు కోల్పోతారు. పిల్లలకు పాలు, నిత్యావసర సరుకులు కూడా దొరకవు. అదే మామూలు రోజుల్లోనైతే...హైదరాబాద్ అంటే... ఓ మహా నగరం. ప్రపంచ చరిత్రలో... హైదరాబాద్ ఓ వరల్డ్ క్లాస్ సిటీ. కానీ వర్షాలు పడితే... మహానగరం కాస్తా.. ఓ మహాసముద్రమైపోతుంది. ఎవరిది తప్పు ?  ‘ఫ్లడ్ మనేజ్‌మెంట్‌’లో హైదరాబాద్ ఎందుకు విఫలమవుతోంది ? అనేదే ఈ కథనం. 


మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే... వర్షం ముందు, వర్షం తర్వాత అని మాట్లాడుకోవాలి. హైదరాబాద్... డెక్కన్ రీజియన్ లో ఉంది. ఇక్కడ వాటర్ ఒకే డైరెక్షన్ లో రాదు. అన్ని డైరెక్షన్స్ లో ఫ్లో అవుతుంది. అందువల్లే... 1908 లో... గ్రేట్ మూసీ ఫ్లడ్స్ వచ్చాయి. హైదరాబాద్ లో అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ళు కొట్టుకుపోయి మరో 80 వేల మంది రోడ్డున పడ్డారు. అప్పుడు... వరదలు వచ్చినా తట్టుకునేలా ఓ మంచి డ్రై.నేజీ సిస్టంతో కూడిన ప్లాన్ గీయమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అడిగారు. ఆయన గీసిన ప్లాన్ ప్రకారం... రెండు రిజర్వాయర్లను కట్టించారు. అవి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు. మళ్ళీ... 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు... హైదరాబాద్ మళ్ళీ మునిగింది. కాకపోతే ఒకప్పుడంత కాదు. ప్రాణనష్టం తగ్గింది. కానీ 2020 లో ఇంత టెక్నాలజీ ఉన్ సమయంలో... ఈ మహానగరం... వరదలు వస్తే ఎందుకు మునిగిపోతోంది ?


అంటే... 1950 వ సంవత్సరంలో... హైదరాబాద్ లో 500 చెరువులుండేవి. బేసిక్ గా హైదరాబాద్ లో ఉన్న ప్రతీ లోతట్టు ప్రాంతంలో కనీసం మూడు నుంచి నాలుగు చెరువులుండేవి. కానీ... ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నవి 191 చెరువులు మాత్రమే. మరి... మిగిలిన 309 చెరువులు 309 చెరువులు ఏమయ్యాయంటే... రాజకీయ నాయకులు కబ్జాలు చేసి భవంతులు కట్టేశారు. పెరిగిన హైదరాబాద్ జనాభా వల్ల ఎంతోమంది... సమ్మర్ టైంలో ఎండిపోయిన చెరువుల్లో ఇళ్ళు కట్టేసుకున్నారు. ఆ మిగిలిన 191 చెరువులు ఏమైనా బాగున్నాయా అంటే... అది కూడా లేదు. విపరీతంగా పెరిగిపోయిన జనాభా వల్ల చెత్త, ఇతరత్రా వృధాలు ఆ చెరువుల్లోకి చేరాయి. ఎండాకాలం వరకూ బాగానే ఉంటుంది. వర్షాకాలంలో... వర్షపు నీరు చెరువుల్లోకి చేరుతుంది. ఇప్పుడు మన ఇళ్ళల్లోకే వచ్చేస్తున్నాయి. అంటే... హైదరాబాద్ లో చెరువులు లేవు. చెరువులున్న చోటే మనమున్నాం. మన అవసరాల కోసం చెరువులను నాశనం చేశాం.


భవిష్యత్తులో... తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మొత్తం విషయంలో రాజకీయ నాయకులది ఎంత తప్పుందో... మనదీ అంతే తప్పుంది. ఇప్పుడు హైదరాబాద్ బాగుపడాలంటే... చెరువుల్లో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళను ఖాళీ చేయించడం కుదురుతుందా ? అస్సలు కుదరదు. ఒకవేళ ఖాళీ చేయిస్తే... వాళ్ళకు వేరే చోట ఇళ్ళు కట్టించి అప్పుడు ఖాళీ చేయించాల్సి ఉంటుంది. అసలే ఖాళీ లేని హైదరాబాద్ లో మళ్ళీ ఇళ్ళు కట్టాలంటే... ఇంకో చెరువులోనే కట్టాలి. దీనికి ఒకటే మార్గం... నీళ్ళు రోడ్ల మీద నిలవ ఉండకుండా... అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను నిర్మించాలి. ఆ డ్రైజేజీ సిస్టం నుంచి... ఇప్పుడు వాడకంలో ఉన్న కొన్ని చెరువుల్లోకి నీళ్ళు వెళ్ళేలా ప్లాన్ చేయాలి.


ఇక ఇప్పటికే చెత్తతో నిండిపోయిన చెరువులను మళ్ళీ తవ్వించాలి. చెరువుల దగ్గర ఇళ్ళు కట్టేముందు... ‘ఎటువంటి ఇబ్బందీ లేదు’ అని చెబుతూ అర్బన్ ప్లానింగ్ కమిటీ ఎన్‌ఓసీ ఇస్తే తప్ప ఇళ్ళ నిర్మాణానికి అనుమతినివ్వకూడదు. అయితే... ఇవన్నీ చేసినా కూడా... భారీ వర్షాలు పడితే... హైదరాబాద్ మళ్ళీ సముద్రమే అవుతుంది. ఇది ఇప్పటిది కాదు. దాదాపు 1950 నుంచీ అందరమూ చేస్తూ వచ్చిన పాపం. చెట్లను నరికివేయడం, చెరువులను కబ్జా చేయడం, చెత్తను వేస్తూ చెరువులను నాశనం చేయడంవల్లే ప్రస్తుత పరిస్థితిని అనుభవిస్తున్నాం. ఇక... అటు పాలకులు, అధికారులే కాదు... ఇటు ప్రజలమూ కళ్ళు తెరవాలి. 


Updated Date - 2020-10-19T21:36:33+05:30 IST