టీఆర్‌ఎస్‌ హయాంలో బాసరపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-30T06:59:50+05:30 IST

సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న, రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్‌ ఐటీ ఉన్న బాసర అభివృద్దిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న దని డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ హయాంలో బాసరపై నిర్లక్ష్యం
విలేకరులతో మాట్లాడుతున్న డీసీసీ అద్యక్షులు రామరావు పటేల్‌

విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌ 

బాసర జూన్‌, 29 : సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న, రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్‌ ఐటీ ఉన్న బాసర అభివృద్దిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న దని డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌ అన్నారు. బుధవారం సరస్వతీ అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్య మంత్రికి బాసర క్షేత్రంపై కొంచమన ధ్యాస లేదని ఇప్పటి వరకు ఒక్కసారైనా రాలేరని చెప్పారు. సమైక్యరాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప జిల్లా దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పటి అభివృద్ది జరగకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పదేపదే బాసరకు రూ.50 కోట్లు నిధులిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క పనైనా చేసిందో తెలపాలని డి మాండ్‌ చేశారు. హామీలు తప్ప అభివృద్ది లేదని విమర్శించారు. అదేవిధంగా రా ష్ట్రంలో ఉన్న ఒక్క ట్రిపుల్‌ఐటీ అమ్మవారి చెంత ఉందని అందులో అడుగడు గునా సమస్యలే రాజ్యమేలుతున్నాయని అన్నారు. విద్యార్థులు ఆందోళనకు దిగినా ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవడం లేదని, ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు పిచ్చికుక్కల నుంచి రక్షణ కరువైందని అన్నారు. అమ్మవారి ఆలయానికి ఇప్పటి వరకు రెగ్యులర్‌ ఈవో లేరని అటు వైపు యూనివర్సిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ వీసీని నియమించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పారు. 

అమ్మవారి బంగారు కానుకల్లో గోల్‌మాల్‌ 

సరస్వతి అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన బంగారు, వెండి కానుకలు పక్కదారి పడుతున్నాయని రామరావుపటేల్‌ ఆరోపించారు. 2019 నుంచి 2022 వరకు ఆలయంలో వచ్చిన వెండి, బంగారు కానుకల లెక్కలు ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. అమ్మవారి బంగారు కానుకలు ఆలయ అభివృదికి వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ఆనంద్‌రావు పటేల్‌, కాంగ్రెస్‌పార్టీ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షులు బిద్దూర్‌ రమేష్‌, నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అద్యక్షులు సాయినాథ్‌, రాజు దేశాయ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-06-30T06:59:50+05:30 IST