రోడ్డు విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-12-03T06:57:55+05:30 IST

జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఆగమాగంగా కొనసాగుతున్నాయి.

రోడ్డు విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం
నడిరోడ్డుపై స్తంభాలు తొలగించకుండా వేసిన తారు

 ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం 

- బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు 

నల్లగొండ క్రైం, డిసెంబరు 2 : నల్లగొండ పట్టణ పరిధిలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్‌ అజాగ్రత్తతో ఆర్టీసీ బస్సును వెనకాల నుంచి ఢీకొట్టిన తర్వాత డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు, డీసీఎం డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమచారం మేరకు మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును చర్లపల్లి సమీపంలోని మర్రిగూడ బైపాస్‌ అంబేడ్కర్‌-జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాల వద్ద బస్సు వెనకాల వస్తున్న డీసీఎం ఢీకొంది. అనంతరం డీసీఎం బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో కొద్ది మంది ప్రయాణికులు మాత్రమే ఉండడంతో స్వల్ప గాయాలు కాగా పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సును డీసీఎం వెనకాల నుంచి ఢీకొట్టడంతో  బస్సు వెనుకభాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.


  

ఆటో బోల్తా : ఇద్దరికి గాయాలు

పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు2:  బస్సును ఒవర్‌టేక్‌ చేసే క్రమంలో వేగాన్ని అదుపు చేయలేక ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. కొదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై ఘనపురం స్టేజీ వద్ద గురువారం ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చిన్నఅడిశర్లపల్లికి చెందిన గడ్డం బుచ్చమ్మ, శ్రీరాములు దంపతులు పెద్దవూర మండలం సంగారం గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని, తిరుగు ప్రయాణంలో ఘనపురం గ్రామం స్టేజీ వద్దకు రాగానే ఆటో వేగాన్ని నియంత్రించే క్రమంలో బ్రేక్‌ వేయడంతో ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తాకొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వెంటనే గుడిపల్లి పోలీసులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.


మిర్యాలగూడలో మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు రంగారెడ్డి

కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

 ిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  రంగారెడ్డి

 మిర్యాలగూడ/ నల్లగొండ రూరల్‌/ కట్టంగూర్‌/ మర్రిగూడ/ దేవరకొండ/ త్రిపురారం,   డిసెంబరు 2: భవన నిర్మాణరంగ కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్థానిక లేబర్‌ అడ్డావద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికల చట్టాల రక్షణ కోసం కార్మికులు పోరాడాలన్నారు. నిర్మాణ రంగంలో పెరిగిన ముడిసరుకుల ధరలు తగ్గించాలన్నారు. అందుకోసం డిసెంబర్‌ 2, 3 తేదీల్లో  దేశవ్యాప్త సమ్మెలో సిఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కార్మిక చట్టాలను పునరుద్ధరింప చేసుకోవాలన్నారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ అధ్యక్షత వహించగా, జిల్లా నాయకులు డాక్టర్‌ మల్లు గౌతంరెడ్డి, తిరుపతి రాం మూర్తి, నల్లగుంట్ల సోమయ్య, మంగారెడ్డి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, గోవర్ధిని, పాడేటి ప్రసాద్‌, కేశవులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు రక్షణకోసం ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపు నిచ్చారు. కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీడబ్లూఎ్‌ఫఐ) కేంద్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు చెపట్టిన  సమ్మెలో భాగంగా నల్లగొండలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి.సలీం, భవన నిర్మాణ కార్మిక సంఘం జి ల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ, జిల్లా కమిటీ సభ్యుడు పోలే సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సాగర్ల మల్లయ్య,  సుందరయ్య సెంట్రింగ్‌ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బచ్చల కూరి గురవయ్య దేవరపల్లి వెంకట్‌రెడ్డి లింగయ్య పాల్గొన్నారు. కట్టంగూరులో నిర్వహించిన కార్య క్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుకూరి నర్సింహ, నాయకులు పాలడుగు యాదయ్య, మల్లేశం, నర్సింహ, బండారి యాదయ్య, దొడ్డు నర్సింహ, పందుల సైదులు, వెంకటేశం అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మర్రిగూడలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఏర్పుల యాదయ్య, భూషరాజు లక్ష్మణ్‌, సైదులు, లఫంగి లింగయ్య, నర్సింహ, పర్వతాలు, నూకల యాదయ్య పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి దేవరకొండలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్లా వెంకటయ్య, సీఐటీయూ నాయకులు లింగయ్య, చిన్న వెంకటయ్య, ఇద్దయ్య, గిరి, ఆంజనేయులు పాల్గొన్నారు.  త్రిపురారంలో భవన నిర్మాణ కార్మికులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదయ్య, కెవీసీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దైద శ్రీను, మద్దెల శ్రీను, నగిరి వెంకన్న, బైరం శ్రీను, బాబు, వెంకటేశ్వర్లు, నాగయ్య, సైదులు, కొండేటి శ్రీను, సురేష్‌ పాల్గొన్నారు.  దామరచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి బైరం దయానంద్‌, సీపీఎం మండల కార్యదర్శి మాలోతు వినోద్‌నాయక్‌, పాపానాయక్‌, సుభాని, పల్లపు సుదర్శన్‌, బాబ, దుర్గయ్య పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి


ఽధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి బీజేపీనే కారణం 

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది కేంద్ర ప్రభుత్వమే: ఎమ్మెల్సీ గుత్తా 

నల్లగొండ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది యాసంగి ధాన్యం ఇంకా 50శాతం ఎఫ్‌సీఐ గోదాంలోనే ఉందని, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటుచేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం రీసైక్లింగ్‌, కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు బీజేపీ నేతలు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కొనుగోలు ప్రక్రియ చేసేది కేంద్రమే, అయినప్పుడు అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరికి మద్దతు ధర కంటే రూ.800 తక్కువకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారని గుర్తుచేశారు. స్థానిక రైతులకు ఇ బ్బందులు కలగొద్దనే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం సీఎం కేసీఆర్‌ భారీగా పెంచారని అన్నారు. సమావేశంలో నల్లగొండ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రాంరెడ్డి  పాల్గొన్నారు. 


  నడిరోడ్డులో తొలగించని విద్యుత్‌ స్తంభాలు

 నల్లగొండ, డిసెంబరు 2 : జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఆగమాగంగా కొనసాగుతున్నాయి. రోడ్లు కాంట్రాక్టు పట్టిన కాంట్రాక్టర్లు తమ పని తాము చేసుకపోతుండగా ట్రాన్స్‌కో మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్డు విస్తరణ పనులు జరగటానికి ముందు ఎన్నో సంవత్సరాల నాటి భారీ వృక్షాలను కొట్టివేసిన యంత్రాంగం ఆ తర్వాత రోడ్డు పనులను ప్రారంభించింది. అయితే కాం ట్రాక్టర్లు విద్యుత్‌ స్తంభాలను తొలగించేందుకు సంబంధిత శాఖను సంప్రదించకుండానే డస్ట్‌తో పాటు కంకర, సిమెంట్‌ వేసి రోడ్డును ఎత్తుచేసి ప్ర స్తుతం తారు రోడ్డు పనులను చేపట్టారు. అటు కాంట్రాక్టర్లకు ఇటు యం త్రాంగానికి మరోవైపు విద్యుత్‌ శాఖ అధికారులకు సమన్వయం లేకపోవడంతో రోడ్డు విస్తరణ పనులు దారుణంగా తయారు కావడమే కాకుండా వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. విద్యుత్‌శాఖ అధికారులు నడిరోడ్డుపైన గతంలో ఉన్న స్తంభాలను ఇప్పటి వరకు తొలగించలేదు. ఆ స్తంభాలను తొలగించి కొత్త రోడ్డుకు అవతలివైపు ఏర్పాటు చేసి విద్యుత్తును పునరుద్ధరించాల్సి ఉంది. ఎక్కడి స్తంభాలు అక్కడే ఉండడంతో పాటు అక్కడక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా రోడ్డుపైనే ఉండటం గమనార్హం. రాత్రి సమయంలో ప్రయాణం చేసే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విస్తరణ పనులు మొదలైన తర్వాత కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి య్యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో ఓ వాహనం ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యాడు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నప్పటికి అటు కాంట్రాక్టర్లు ఇటు అధికార యంత్రాంగం రోడ్డు విస్తరణ పనులను సవ్యంగా చేయాలనే ఆలోచనకు రావడం లేదు.

Updated Date - 2021-12-03T06:57:55+05:30 IST