చెన్నై కోచ్‌ హస్సీకి నెగెటివ్‌

ABN , First Publish Date - 2021-05-08T09:29:24+05:30 IST

కరోనా సోకిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ శుక్రవారం నెగెటివ్‌గా తేలాడు.

చెన్నై కోచ్‌ హస్సీకి నెగెటివ్‌

చెన్నై: కరోనా సోకిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ శుక్రవారం నెగెటివ్‌గా తేలాడు. మరో పరీక్షలో నెగెటివ్‌ వస్తే హస్సీ మాల్దీవులలోని ఆస్ట్రేలియా బృందంతో కలవనున్నాడు. తనపై ప్రత్యేక్ష శ్రద్ధ తీసుకొంటున్న చెన్నై ఫ్రాంచైజీకి హస్సీ కృతజ్ఞతలు చెప్పాడు. న్యూజిలాండ్‌కు చెందిన చెన్నై చీఫ్‌ కోచ్‌ ఫ్లెమింగ్‌ శనివారం స్వదేశానికి వెళ్లనున్నాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపాడు. 

Updated Date - 2021-05-08T09:29:24+05:30 IST