Abn logo
Aug 13 2020 @ 00:02AM

నెగెటివ్‌ ఫర్‌ ఆల్‌

Kaakateeya

దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఆయన స్వయంగా తెలిపారు. జూలై 29న తనతో సహా కుటుంబసభ్యులకు కరోనా వచ్చిందని రాజమౌళి ట్వీట్‌ చేసిన విషయం విధితమే. తాజాగా ‘‘రెండు వారాల క్వారంటైన్‌ పూర్తయింది. ఎటువంటి లక్షణాలు లేవు. ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించుకున్నాం. మా అందరికీ నెగెటివ్‌ అని నిర్ధారణ అయింది. నెగెటివ్‌ ఫర్‌ ఆల్‌! ప్లాస్మా దానం చేయడానికి సరిపడే యాంటీబాడీలు డెవలప్‌ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి ఇప్పటినుంచి మేం మూడు వారాలు వేచిచూడాలని వైద్యులు చెప్పారు’’ అని రాజమౌళి పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement