Himachal: కరోనా నెగిటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ ఉన్నవారికే సందర్శనకు అనుమతి

ABN , First Publish Date - 2021-08-13T13:08:20+05:30 IST

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లో సందర్శించాలనుకునే పర్యాటకులకు...

Himachal: కరోనా నెగిటివ్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ ఉన్నవారికే సందర్శనకు అనుమతి

నేటి నుంచి అమలు...సర్కారు ఉత్తర్వులు

డెహ్రాడూన్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లో సందర్శించాలనుకునే పర్యాటకులకు ఆ రాష్ట్ర సర్కారు తాజాగా ఆంక్షలు విధించింది. పర్యాటకుల రాకతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇక నుంచి సందర్శకులు 24 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్, రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకున్న రిపోర్టు ఉంటేనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఈ రెండు రిపోర్టులు ఉన్న పర్యాటకులనే హిమాచల్ ప్రదేశ్ సందర్శనకు అనుమతిస్తామని సర్కారు ప్రకటించింది.ఈ మేర హిమాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 


కరోనా కేసుల గురించి సమీక్షించిన చీఫ్ సెక్రటరీ కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున పర్యాటకులపై ఆంక్షలు విధించారు.ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు పూర్తి టీకాలు లేదా ప్రతికూల కొవిడ్ -19 పరీక్ష నివేదికను తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ నిర్ణయం తీసుకుంది.హిమాచల్ లో గత 24 గంటల్లో 354 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. ప్రస్థుతం హిమాచల్ లో 2,668 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 

Updated Date - 2021-08-13T13:08:20+05:30 IST