మద్దతు స్థాయిలు 17500, 17350

ABN , First Publish Date - 2022-01-24T07:03:30+05:30 IST

నిఫ్టీ గత వారం 18350 వద్ద రియాక్షన్‌కు గురై బలమైన కరెక్షన్‌లో నడిచి చివరికి 650 పాయింట్ల భారీ నష్టంతో వారం కనిష్ఠ స్థాయిల్లో ముగిసింది...

మద్దతు స్థాయిలు 17500, 17350

నిఫ్టీ గత వారం 18350 వద్ద రియాక్షన్‌కు గురై బలమైన కరెక్షన్‌లో నడిచి చివరికి 650 పాయింట్ల భారీ నష్టంతో వారం కనిష్ఠ స్థాయిల్లో ముగిసింది. ఇది బలహీన ట్రెండ్‌ సంకేతం. నాలుగు వారాల బలమైన ర్యాలీ ఇక్కడితో నిలిచిపోయింది. ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోవడం కూడా స్వల్పకాలిక విరామ సంకేతం. మార్కెట్‌ ఎక్కడ మద్దతు తీసుకుంటుందో తేలే వరకు స్వల్పకాలిక బై పొజిషన్లకు దూరంగా ఉండడం మంచిది. అమెరికన్‌ మార్కెట్ల బలహీనత కారణంగా ఈ వారం బలమైన డౌన్‌ట్రెండ్‌తోనే ప్రారంభం కావచ్చు. 71350 వద్ద బలమైన మద్దతు ఉంది.


బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ధోరణిలో ట్రేడయితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 17600 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 18000. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు ఆస్కారం ఉంటుంది. ఏమైనా రాబోయే కొద్ది రోజుల్లో మరింత కన్సాలిడేట్‌ కావడం తప్పనిసరి.


బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌లో పడి మైనర్‌ మద్దతు స్థాయి 17500 కన్నా దిగజారితే మైనర్‌ బలహీనత సంకే తం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 17350. సానుకూలత కోసం ఇక్కడ బౌన్స్‌బ్యాక్‌ కావడం తప్పనిసరి. 


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా 39000 స్థాయిలో బలమైన రియాక్ష్‌ సాధించి 800 పాయింట్ల నష్టంతో ముగిసింది. ప్రధాన మద్దతు స్థాయిలు 37000, 36950. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ పునరుజ్జీవం తప్పనిసరి. రికవరీ బాట పడితే ట్రెండ్‌లో సానుకూలత కోసం నిరోధ స్థాయి 38200 కన్నా పైన నిలదొక్కుకోవాలి.


పాటర్న్‌: గత వారం 100 డిఎంఏ కన్నా దిగువకు వచ్చిన నిఫ్టీ ఇప్పుడు 200 డిఎంఏకి చేరువవుతోంది. తదుపరి స్వల్పకాలిక దిశ తీసుకునే ముందు ఇక్కడ రికవరీ ఏర్పడవచ్చు. ఆర్‌ఎస్‌ఐ సూచీల ప్రకారం డెయిలీ చార్టుల్లో గత వారం ఓవర్‌బాట్‌ స్థితి సద్దుబాటయింది. నెలవారీ చార్టుల్లో మాత్రం ఇంకా ఓవర్‌బాట్‌ స్థితి ఉంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉంది. 

Updated Date - 2022-01-24T07:03:30+05:30 IST