నీటి గుండంలో గల్లంతైన విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-08-08T02:29:02+05:30 IST

రాపూరు ఘాట్‌రోడ్డులోని సిద్దిలేశ్వరకోన జలపాతంలో గల్లంతైన 9వ తరగతి విద్యార్థి అన్నం శశికుమార్‌ (16) మృతిచెందిన

నీటి గుండంలో గల్లంతైన విద్యార్థి మృతి
గల్లంతైన యువకుడిని బయటకు తీసుకువస్తున్న జాలర్లు

రాపూరు, ఆగస్టు 7: రాపూరు ఘాట్‌రోడ్డులోని సిద్దిలేశ్వరకోన జలపాతంలో గల్లంతైన 9వ తరగతి విద్యార్థి  అన్నం శశికుమార్‌ (16) మృతిచెందినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. నెల్లూరు దర్గామిట్టకు చెందిన 15మంది యువకులతోపాటు అన్నదమ్ములైన శశికుమార్‌, రాజేష్‌లు శనివారం ఘాట్‌రోడ్డులోని జలపాతం వద్దకు వచ్చి జలకాలాడారు. శశికుమార్‌కు ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. శనివారం రాత్రి కావడంతో గాలింపు  చేపట్టలేదు. ఆదివారం తెల్లవారుజామున అటవీ, ఫైర్‌ సిబ్బంది వెళ్లి గాలింపు చేపట్టారు. ప్రయోజనం లేకపోవడంతో డ్యాంలో చేపలు పట్టే జాలర్లను తీసుకువచ్చి గాలింపు మొదలుపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుహలో మృతదేహం ఇరుక్కుని ఉండడాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం  నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఇద్దరు బిడ్డల్లో ఓ బిడ్డ మృత్యువాతపడడంతో తండ్రి వెంకటేశ్వర్లు తల్లిడిల్లిపోయారు. బంధువులు, స్నేహితులు ఆయన్ను ఓదార్చారు.



Updated Date - 2022-08-08T02:29:02+05:30 IST