ఈ గోల్డ్ మెడల్ నాది కాదు: నీరజ్ చోప్రా

ABN , First Publish Date - 2021-08-10T05:21:40+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో మెరిసిన జావెలిన్ త్రో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 121 ఏళ్ల భారత ..

ఈ గోల్డ్ మెడల్ నాది కాదు: నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో మెరిసిన జావెలిన్ త్రో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 121 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో అథ్లెటిక్స్‌లో గోల్డ్ కొట్టిన ఏకైక క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. అలాగే ఒలింపిక్స్‌లో 13ఏళ్లుగా పసిడి పతకం కోసం ఎదురు చూస్తున్న భారత్‌కు కల నెరవేర్చాడు. ఈ క్రమంలోనే తాను గెలిచిన మెడల్ గురించి మాట్లాడాడు. ఈ మెడల్ తనది కాదని అన్నాడు.


ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నీరజ్.. తాను గెలిచిన బంగారు పతకం తనది మాత్రమే కాదని, ఈ పతకం దేశానికి చెందుతుందని అన్నాడు. ‘నేను ఈ మెడల్‌ను నా జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. పతకం గెలిచినప్పటి నుంచి కనీసం సక్రమంగా తినలేకపోతున్నా. పడుకోలేకపోతున్నా. అయితే ఈ పతకం చూడగానే సర్దుమణిగిపోతుంది’ అని నీరజ్ పేర్కొన్నాడు.

Updated Date - 2021-08-10T05:21:40+05:30 IST