తొలి టైటిల్‌పై నీరజ్‌ గురి

ABN , First Publish Date - 2022-06-30T08:42:08+05:30 IST

తొలి టైటిల్‌పై నీరజ్‌ గురి

తొలి టైటిల్‌పై నీరజ్‌ గురి

నేడు స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌

స్టాక్‌హోమ్‌: ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో తొలిసారి టైటిల్‌ నెగ్గాలని భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పట్టుదలగా ఉన్నాడు. గురువారం జరిగే ఈ లీగ్‌లో 4 సంవత్సరాల తర్వాత అతడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇటీవల పావో నూర్మీ గేమ్స్‌లో 89.30 మీ. జావెలిన్‌ విసిరిన 24 ఏళ్ల నీరజ్‌ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అదే ఊపులో క్యుర్టేన్‌ గేమ్స్‌లో స్వర్ణం (86.60మీ.) సాధించాడు. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప, కామన్వెల్త్‌ క్రీడలు లక్ష్యంగా ఈ మీట్లలో మెరుగైన ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నట్టు నీరజ్‌ తెలిపాడు. ఏడుసార్లు డైమండ్‌ లీగ్‌లలో తలపడినా నీరజ్‌ ఒక్కసారీ టైటిల్‌ అందుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ముగ్గురు అథ్లెట్లూ స్టాక్‌హోమ్‌ బరిలో ఉండడంతో పోటీ తీవ్రంగానే ఉండనుంది.

Updated Date - 2022-06-30T08:42:08+05:30 IST