Abn logo
Sep 21 2021 @ 18:08PM

Neeraj Chopra: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్వర్ణ పతక విజేత

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో పసిడి పతకం సాధించి దేశం మొత్తానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. తాజాగా, ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ తాజాగా అతడితో రూపొందించిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ యాడ్ చూసిన నెటిజన్లు నీరజ్‌లో మంచి క్రీడాకారుడు మాత్రమే కాదు.. అంతకుమించిన నటుడు కూడా ఉన్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రకటనలో నీరజ్ ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. 


రిపోర్టర్‌గా, బిజినెస్‌మ్యాన్‌గా, సినీ దర్శకుడిగా, బ్యాంక్ అధికారిగా పలు పాత్రల్లో కనిపించాడు. జావెలిన్ త్రో ఔత్సాహికుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ యాడ్ చూసిన వారు అతడిని చోప్రా అంటే నమ్మలేరంటే అతిశయోక్తి కాదేమో. వైరల్ అవుతున్న ఈ యాడ్ ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 


నీరజ్ చోప్రా సహా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతోపాటు పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ఇక నెటిజన్లు అయితే కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఆ యాడ్‌లో ఉన్నది నీరజ్ అంటే నమ్మశక్యం కాకుండా ఉందని ఒకరంటే, ‘సూపర్ కంటే చాలా ఊపర్ ఉందని’ మరొకరు ప్రశంసించారు. తన కళ్లను తానే  నమ్మలేకపోతున్నానని ఒకరు, ఇండియాలోని స్టార్ కిడ్స్ కంటే ట్యాలెంట్‌లో నీరజ్ చోప్రా బెటరని ఇంకొకరు కామెంట్ చేశారు. నీరజ్.. నీ బయోపిక్‌లో నువ్వే నటిస్తావంటూ మరొకరు ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...