Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత Neeraj Chopraకు అమెరికాలో శిక్షణ

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 90 రోజులపాటు శిక్షణ తీసుకునేందుకు అమెరికాకు వెళ్లనున్నారు. చులా విస్టా ఎలైట్ అథ్లెట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ కోసం అమెరికా వెళ్లేందుకు వీలు కల్పించే అత్యవసర ప్రతిపాదనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శుక్రవారం ఆమోదం తెలిపింది.జావెలిన్ త్రోయర్ చోప్రా ఆదివారం అమెరికాకు వెళ్లేందుకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన నాలుగు గంటల్లోనే సాయ్ ఆమోదించింది.టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ కింద ప్రతిష్ఠాత్మకమైన చులా విస్టా ఎలైట్ అథ్లెట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు వీలుగా నీరజ్ కు రూ.38 లక్షలను సాయ్ మంజూరు చేసింది.

చోప్రా 2022 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల కోసం శాన్ డియాగోలోని చులా విస్టాలోని శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందనున్నారు.ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షణ ఇచ్చే 155 ఎకరాల్లో విస్తరించి ఉన్న అత్యాధునిక కేంద్రంలో చోప్రా శిక్షణ పొందనున్నారు.యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలు, చైనాలోని హాంగ్‌జౌలో జరిగే ఆసియా క్రీడలకు సిద్ధం కావడానికి నీరజ్ చోప్రాకు ఈ శిక్షణ సహాయపడుతుందని సాయ్ తెలిపింది. చోప్రాతో కలిసి కోచ్ క్లాస్ బార్టోనిట్జ్ యూఎస్ వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement