విత్తనాల నిల్వకు వేపనూనె సంచులు

ABN , First Publish Date - 2020-10-24T09:12:49+05:30 IST

పంట పండించడం ఎంత ముఖ్యమో.. మరో పంటకు విత్తనాలు దాచుకోవడం అంతకన్నా ముఖ్యం. అందుకు రైతులు చాలా రకాల పద్ధతులు వాడతారు. కుండల్లో, చెక్కపెట్టెల్లో, వెదురు బుట్టల్లో,

విత్తనాల నిల్వకు వేపనూనె సంచులు

ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల ఆవిష్కరణ


పంట పండించడం ఎంత ముఖ్యమో.. మరో పంటకు విత్తనాలు దాచుకోవడం అంతకన్నా ముఖ్యం. అందుకు రైతులు చాలా రకాల పద్ధతులు వాడతారు. కుండల్లో, చెక్కపెట్టెల్లో, వెదురు బుట్టల్లో, గోనె సంచుల్లో, నేలమాళిగలో.. ఇలా రకరకాల చోట్ల దాస్తారు. అవి పురుగు పట్టకుండా.. బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రసాయనాలు కూడా వాడతారు. ఐఐటీ హైదరాబాద్‌లోని కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన చంద్రశేఖర్‌ శర్మ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. ఈ కష్టాలన్నింటికీ చెక్‌పెట్టే ఉత్పత్తిని తయారు చేసింది. విత్తనాలను దీర్ఘకాలంపాటు సురక్షితంగా దాచుకునేలా.. వేప నూనెతో తయారుచేసిన నానోఫైబ్రస్‌ సంచులను ఆయన అభివృద్ధి చేశారు. వీటిలో దాచి ఉంచిన విత్తనాల్లో 90 శాతం దాకా.. 75 రోజులపాటు చక్కగా ఉన్నాయని, వాటికి ఫంగస్‌ పట్టలేదని పరీక్షల్లో తేలింది. ఇదే సమయంలో.. మామూలు సంచుల్లో ఉంచిన విత్తనాల్లో 70% మేర ఫంగస్‌ బారిన పడ్డాయి. ఏ విత్తనాలనైనా ఈ బ్యాగుల్లో ఎక్కువ రోజులపాటు సాధారణ గది ఉష్ణోగ్రతలోనే భద్రపరచుకోవచ్చు. అయితే, ఈ నానోఫైబర్‌ సంచులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రస్తుతానికి సవాలేనని.. కానీ, భవిష్యత్తులో ఈ సంచులు అందరికీ అందుబాటులోకి వస్తాయని చంద్రశేఖర్‌ శర్మ పేర్కొన్నారు.


స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-10-24T09:12:49+05:30 IST