‘వీసీని రీకాల్‌ చేయాల్సిందే’

ABN , First Publish Date - 2022-05-23T05:59:15+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆనందరావును రాష్ట్ర ప్రభుత్వం రీకాల్‌ చేసేంత వరకు విద్యార్థి, యువజన సంఘాలతో పోరాడుతామని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు అన్నారు.

‘వీసీని రీకాల్‌ చేయాల్సిందే’

కర్నూలు(అర్బన్‌), మే 22: రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆనందరావును రాష్ట్ర ప్రభుత్వం రీకాల్‌ చేసేంత వరకు విద్యార్థి, యువజన సంఘాలతో పోరాడుతామని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేసి నూతన కోర్సులు పెంచాలని, ల్యాబ్‌లు, లైబ్రరీలు, హాస్టళ్లలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.  యూనివర్సిటీలలో పీజీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు ఆయా యూనివర్సిటీల పరిధిలో నిర్వహించి విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలన్నారు. యూనివర్సిటీలలో వీసీల నియంతృత్వ పాలనపై, అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.  ఈ సమావేశంలో ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడు, శరత్‌ కుమార్‌, మునిస్వామి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి భాస్కర్‌, డీఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి మహేంద్ర, హరి, అనిల్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T05:59:15+05:30 IST