‘స్వచ్ఛ సంకల్పం’లో భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2021-07-25T05:32:12+05:30 IST

స్వచ్ఛ సంకల్పంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు.

‘స్వచ్ఛ సంకల్పం’లో భాగస్వామ్యం కావాలి
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ లఠ్కర్‌:

  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌  

ఎచ్చెర్ల, జూలై 24: స్వచ్ఛ సంకల్పంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు.  అంబేడ్కర్‌ యూని వర్సిటీ, మహాత్మాగాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంజీఎన్‌సీ ఆర్‌ఈ)సంస్థ సంయుక్తంగా శనివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన స్వచ్ఛ ప్రణాళిక వర్క్‌షాపులో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. వర్సిటీని గ్రీన్‌ క్యాంపస్‌గా అభివృద్ధి చేయడంతో పాటు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై చైతన్యకార్యక్రమాలు నిర్వహించి గ్రీన్‌ చాంపియన్‌ అవార్డును సాధించడం అభినందనీయమన్నారు. జలసంరక్షణ, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణ అంశాలపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు సాధించ వచ్చని చెప్పారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు మాట్లాడుతూ, వర్సిటీ సామాజిక అభివృ ద్ధిలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చైతన్యపర్చినట్లు చెప్పారు. ద్రవిడ యూనివర్సిటీ యుబీఏ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.యశోద మాట్లాడుతూ, స్వచ్ఛత ప్రణాళిక ఆవశ్యకతను వివరించారు.  కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌  తమ్మినేని కామరాజు, ప్రిన్సిపాళ్లు  బిడ్డిక అడ్డ య్య, పీలా సుజాత, ఎంజీఎన్‌సీఆర్‌ఈ కోఆర్డినేటర్‌ సాయి కిరణ్‌, వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త ఎం.అనూరాధ పాల్గొన్నారు. 

 పరిశ్రమల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించండి

 కలెక్టరేట్‌:  పరిశ్రమల్లో తరచూ మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీలఠ్కర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీ క్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  పరిశ్రమల్లో ప్రమాదాలను ఎదుర్కోవ డానికి అధికారులు సూచించిన భద్రతా పరికరాలు కొనుగోలు చేయాలని తెలిపారు. డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ఫ్యాక్టరీస్‌ సత్యనారాయణ, డీఆర్వో దయానిధి, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్నారావు, జిల్లా అగ్నిమాపక అధికారి కృపావరం పాల్గొన్నారు. 


 



Updated Date - 2021-07-25T05:32:12+05:30 IST