మంచి ఆహార అలవాట్లను నేర్చుకోవాలి:కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-28T05:59:15+05:30 IST

గర్భిణులు, తల్లులు మం చి ఆహార అలవాట్లను నేర్చుకొని ఆరోగ్యవంత సమాజ నిర్మాణానికి దోహదపడాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. మండలంలోని అర్రూరు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

మంచి ఆహార అలవాట్లను నేర్చుకోవాలి:కలెక్టర్‌
అర్రూరులో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

వలిగొండ, మే 27: గర్భిణులు, తల్లులు మం చి ఆహార అలవాట్లను నేర్చుకొని ఆరోగ్యవంత సమాజ నిర్మాణానికి దోహదపడాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. మండలంలోని అర్రూరు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పిల్లలకు సరైన సమయంలో, సరైన మోతాదులో ఆహారాన్ని, పండ్లు, కూరగాయలు, పప్పులు, గుడ్లు, పాలు అందించాలన్నారు. వ్యాయామం చేయడం వల్ల సాధారణ ప్రసవానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. అనంతరం గర్భిణులకు సా మూహిక శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. అనంతరం వేములకొండ ప్రా థమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి బా లింతలకు కేసీఆర్‌ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు, సలహా లు ఇచ్చారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో కృష్ణవేణి, సీడీపీవో శైలజ, సర్పంచ్‌ చిట్టేడి జయమ్మ, ఎంపీటీ సీ పసల జ్యోతి, వైద్యాధికారి డాక్టర్‌ జ్యోతి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు శోభారాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:59:15+05:30 IST