ఓటు విలువ తెలుసుకోవాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-26T04:56:45+05:30 IST

ప్రతిఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ప్రభుత్వ పురుషుల కళాశాల విద్యార్థులు ఓటుః18 ఆకారంలో ఏర్పడ్డారు.

ఓటు విలువ తెలుసుకోవాలి: కలెక్టర్‌
కవిటి:కుసుంపురంలో ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తున్నఉపాధ్యాయులు:



గుజరాతీపేట: ప్రతిఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ప్రభుత్వ పురుషుల కళాశాల విద్యార్థులు ఓటుః18 ఆకారంలో ఏర్పడ్డారు.    ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జేసీ విజయసునీత, ప్రిన్సిపాల్‌  పి.సురేఖ, తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు కీలకమని  తహసీల్దార్‌ బి.శ్రీహరి  తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో  జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వీఆర్వోలు, వీఆర్‌ఏలతో ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ఓటు కార్డులు  అందజేశారు. ఎస్టీవో ప్రసాద్‌, సీఎస్‌డీటీ శంకరరావు పాల్గొన్నారు. కవిటి: మండలంలోని కుసుంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో  ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. బ్యాలెట్‌ పెట్టెలు, ఓటువేయడం, ఈవీఎం మిషన్లు, గుర్తు లుపై విద్యార్థులకు వివరించారు.  కార్యక్రమంలో హెచ్‌ఎం ఎం.రామారావు, ఉపాధ్యా యులు అనిల్‌కుమార్‌, పార్వతి, మణమ్మ, మాధవి  పాల్గొ న్నారు. పాలకొండ: జనవరి  ఒకటో తేదీ  18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిన్సిపాల్‌ డాక్టర్‌ జి.జనార్దననాయుడు కోరారు.  పాలకొండ   ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.ప్రభాకర రావు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో  బి.రాజు,  అధ్యాపకులు అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. అలాగే తంపటాపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓటర్ల దినోత్సవం   నిర్వహించారు.  కార్య క్రమంలో ఉపాధ్యాయులు, వై.జె.నాయుడు, కె.జనార్దనరావు, కె.శ్రీరామ్మూర్తి పాల్గొన్నా రు. భామిని: భామినిలో బీఎల్వోలు ఓటర్ల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో గిరీష్‌పట్నాయక్‌, జయంతి, గంగన్న, జితేంద్ర, అరుణ పాల్గొన్నారు.

 



Updated Date - 2022-01-26T04:56:45+05:30 IST