వాషింగ్టన్: ప్రపంచం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ధనిక దేశాలు కరోనా వ్యాక్సిన్‌తో పాటు కోవిడ్ వైద్య సాయానికి ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. ఒక వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న బైడెన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల నేతలతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలు కరోనా చికిత్స విషయంలో వైద్య సదుపాయాల లేమితో సతమతమవుతున్న దేశాలకు సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అమెరికాలో కరోనా కట్టడికి బూస్టర్ డోసు అవసరాన్ని గుర్తించామని, దీనిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికల్లా ప్రపంచంలోని 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని ఆయన అన్ని దేశాల నేతలను కోరారు. కాగా అమెరికా 500 మిలియన్ల కరో్నా టీకాలను సాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశాంలో పాల్గొన్న జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మాట్లాడుతూ తమ దేశం తరపున 60 మిలియన్ల వ్యాక్సీన్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.