వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-04-17T05:56:24+05:30 IST

కాలానుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారానే విధుల్లో రాణించవచ్చని అడిషనల్‌ డీసీపీ (పరిపా లన) జి చంద్రమోహన్‌ అన్నారు.

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
మాట్లాడుతున్న అడిషనల్‌ డీసీపీ(పరిపాలన), పాల్గొన్న అధికారులు

 అడిషనల్‌ డీసీపీ(పరిపాలన) జి చంద్రమోహన్‌

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 16: కాలానుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారానే విధుల్లో రాణించవచ్చని అడిషనల్‌ డీసీపీ (పరిపా లన) జి చంద్రమోహన్‌ అన్నారు. శుక్రవారం కమిష నరేట్‌ పరిధిలోని వివిధ పోలీస్‌ స్టేషన్లు, వివిధ కా ర్యాలయాలకు చెందిన రైటర్లకు కమిషనరేట్‌ కేంద్రం లో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జి చంద్రమోహన్‌ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్ల విధి నిర్వహణలో రైటర్లు కీలకపాత్ర పోషించాలని, టెక్నాలజీ వినియోగంతో ముందుకు సాగాలన్నారు. దరఖాస్తు స్వీకరణ నుంచి మొదలుకుని కేసు పూర్త య్యేంతవరకు టెక్నాలజీ వినియోగంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు.  కేసుల వివరాల నమోదులో సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోవాలని తెలిపా రు. సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టులో కేసుల దర్యాప్తుల వివ రాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని చెప్పా రు. స్టేషన్లకు చెందిన ఎస్‌హెచ్‌వోల తర్వాత కీలక పాత్ర రైటర్లదేనని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలందించవచ్చని తెలిపారు. పోలీస్‌స్టేషన్లలో క్రమపద్ధతిలో రికార్డుల నిర్వహణను కొనసాగించాల ని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటిక ప్పుడు కేసుల వివరాలను నమోదు చేయాలని చెప్పారు. వివిధ రకాల సమాచారాన్ని వేర్వేరుగా నిక్షిప్తం చేసినట్లయితే సులువుగా ఉండడంతోపాటు కేసుల వివరాలు వెంటనే తెలుసుకోవచ్చని తెలిపా రు. కేసుల వివరాలను నమోదు చేయడంలో ఎలాం టి అనుమానాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవా లని సూచించారు. స్టేషన్‌ రైటర్లు టీఎస్‌కాప్‌ యాప్‌ నకు అనుసంధానం అయ్యే వివిధ రకాల యాప్‌ల వినియోగంపై పట్టు సాధించాలని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ స్థాయిలకు చెందిన పోలీసు స మస్యలను హెచ్‌ఆర్‌యంఎస్‌ విధానం ద్వారా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.  వివిధ కేసుల దర్యాప్తు అధికారులకు తమ అనుభవాలను జోడిస్తూ తమ వంతుగా సహకారం అందిస్తూ నిందితులకు శిక్షలు పడేలా పకడ్బందీ వ్యూహాలను రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో మానకొండూర్‌, ఐటీసెల్‌ ఇన్‌స్పెక్టర్లు సంతోష్‌కుమార్‌, సీహెచ్‌ నటేశ్‌, తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:56:24+05:30 IST