Abn logo
Sep 20 2021 @ 00:44AM

విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

గుజరాతీపేట: పునాది స్థాయిలోనే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విజయనగరం గిరిజన యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ఆచార్య హనుమంతు లజపతిరాయ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శాంతినగర్‌ కాలనీలోని  కళింగ సంక్షేమ సంఘం భవనంలో కళింగ స్టడీ సర్కిల్‌ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై పట్టుసాధించాలన్నారు. పోటీ పరీక్షల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అఖిల భారత కళింగ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు సూర్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న కళింగ నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్‌ ఇచ్చి వాళ్లలో నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు ఇచ్చే విదంగా ఈ స్టడీ సర్కిల్‌ పని చేస్తుందన్నారు.  కార్యక్రమంలో జిల్లా కాళింగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంచరాన నాగభూషణరావు, కోశాధికారి కూన సింహాచలం, జిల్లా కార్యదర్శి ఎండ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రశాంతంగా ఏపీ ఈసెట్‌

ఎచ్చెర్ల/రాజాంరూరల్‌: పాలిటెక్నిక్‌ డిప్లమో పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు ఆదివారం ఏపీ ఈసెట్‌ను నిర్వహించారు. రెండు పూటలా ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష జరిగింది. శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం)లో 360కి 342 మంది, వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎచ్చెర్ల)లో 345కు 331 మంది హాజరయ్యారు. రాజాం జీఎంఆర్‌ ఐటీలో 324 మందికి 307 మంది హాజరయ్యారు. 

భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలి

పాలకొండ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై  ఈనెల 27న చేపట్టనున్న భారత్‌బంద్‌ జయ ప్రదం చేయాలని సీఐటీయూ  జిల్లా కార్యదర్శి దావాల రమణారావు కోరారు. ఆదివారం పాలకొండలో భారత్‌ బంద్‌  కరప త్రాలు ఆవిష్కరించారు.   కార్య క్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఖండాపు ప్రసాదరావు, దుర్గారావు, రాము, శ్రీనివాసరావు పాల్గొన్నారు.