చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-25T05:12:58+05:30 IST

చట్టాల పట్ల అన్ని వర్గాల ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.కవిత పేర్కొన్నారు.

చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి
న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి కవిత

సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత


కడప రూరల్‌, అక్టోబర్‌ 24 : చట్టాల పట్ల అన్ని వర్గాల ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.కవిత పేర్కొన్నారు. ఆజాదికా అమృత్‌ వారోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాలలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయపర విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకుని తద్వారా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నగరంలోని మాసాపేట సర్కిల్‌, మదన్‌ అటో కన్సల్ట్‌, డీసీ రోడ్‌, గౌస్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయ విషయాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేసి, అవగాహన కల్పించామన్నారు. గంగమ్మ టెంపుల్‌ సర్కిల్‌, మాచుపల్లె సర్కిల్‌, మాసాపేట తదితర  ప్రాంతాల్లో  ఇంటింటా న్యాయ ప్రచారం చేసి ఉచిత న్యాయ సహాయం గురించి  తెలియపరిచామన్నారు. లీగల్‌ సర్వీస్‌ అథారిటీ యాక్టు, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌,  రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యా క్టు, ఎన్‌ఎఎల్‌ఎ్‌సఏ పఽథకాల గురించి వివరించామన్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా గౌస్‌ నగరలోని ఉర్దూ హైస్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి కవిత ఐక్యరాజ్య సమితి దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమాలలో టూ టౌన్‌ ఎస్‌ఐ రాఘవేంద్ర, ప్యానల్‌ అడ్వకేట్స్‌, పారాలీగల్‌ వలంటీర్లు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:12:58+05:30 IST