AP News: తీరు మార్చుకోవాలి..సర్పంచ్‌కు గౌరవమివ్వాలి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2022-09-13T03:06:04+05:30 IST

జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట సర్పంచ్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కంకిపాటి కుమారి గెలుపొందారు. అయితే నేటి వరకు గ్రామ సచివాలయంలో సర్పంచ్ చాంబర్ కేటాయించలేదు. సర్పంచ్ దళితురాలు కావడం, ప్రతిపక్ష పార్టీ నుంచి గెలుపొందడంతో ఆమె పట్ల కొందరు అధికార పార్టీ నాయకులు, అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని

AP News: తీరు మార్చుకోవాలి..సర్పంచ్‌కు గౌరవమివ్వాలి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట సర్పంచ్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కంకిపాటి కుమారి గెలుపొందారు. అయితే ఆమెకు నేటి వరకు గ్రామ సచివాలయంలో సర్పంచ్ చాంబర్ కేటాయించలేదు. సర్పంచ్ దళితురాలు కావడం, ప్రతిపక్ష పార్టీ నుంచి గెలుపొందడంతో ఆమె పట్ల కొందరు అధికార పార్టీ నాయకులు, అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని టీడీపీ (TDP) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆరోపించారు. సర్పంచ్‌కు కూర్చోవడానికి కుర్చీ కూడా లేకుండా చేయటం దారుణమని పేర్కొంటూ..టీడీపీ శ్రేణులు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. ఈ సందర్భంగా టీడీపీ మండల  అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ..ప్రజల ఓట్లతో నెగ్గిన ప్రజా ప్రతినిధిని అవమానించడం తగదన్నారు. అధికార పార్టీ నేతలు తీరు మార్చుకోకపోతే నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని తామే ప్రారంభించి కంకిపాటి కుమారిని సర్పంచ్ చాంబర్లో కూర్చోబెడతామని హెచ్చరించారు. అనంతరం తనకు జరుగుతున్న అవమానాన్ని కంకిపాటి కుమారి ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ వినతి పత్రాన్ని వెంటనే ఆర్డీవో పంచాయతీరాజ్ అధికారులకు పంపి పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో  జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజుపాల్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వర రావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడ్లపల్లి ఏడుకొండలు, నంగులూరి జగత్, ముళ్ళపూడి శ్రీనివాస్, గోలిరామకృష్ణారెడ్డి, గంటా రామారావు, భూసా సత్యనారాయణ, లింగాల సత్యనారాయణ, గంధం అప్పాజీ, నిట్ట రాంకుమార్, లక్ష్మణరావు, క్రిష్ నాని, కారుమురి దుర్గారెడ్డి, చిట్టెమ్మ, ఉండవల్లి చంద్రరావు, ఉండవల్లి శ్రీను, రవి, శ్రీను, నవీన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-09-13T03:06:04+05:30 IST