తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-04-20T07:03:04+05:30 IST

ఐకేపీ కేంద్రాల్లో, పీఏసీఎస్‌ కేంద్రాల్లో 15రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని శాలిగౌరారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద సోమవారం రెండు గంటలపాటు రాస్తారోకో చేసి ధాన్యానికి నిప్పుపెట్టారు.

తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి
శాలిగౌరారంలో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేస్తున్న రైతులు

రోడ్డుపై ధాన్యాన్ని తగులబెట్టిన రైతులు

అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం

నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఘటన

శాలిగౌరారం, ఏప్రిల్‌ 19:ఐకేపీ కేంద్రాల్లో, పీఏసీఎస్‌ కేంద్రాల్లో 15రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని శాలిగౌరారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద సోమవారం రెండు గంటలపాటు రాస్తారోకో చేసి ధాన్యానికి నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందని సాకు చూపుతూ మిల్లర్లు ధాన్యాం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ మురళీకృష్ణ రైతుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారుల సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళనను విరమించారు. ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు చామల మహేందర్‌రెడ్డి, జమ్ము రమేష్‌, చింత ఽధనుంజయ్య, మక్క బుచిరాములు, బండపెల్లి కొమరయ్య, షేక్‌ జహంగీర్‌, తాందారి సత్తయ్య, ఉప్పరబోయిన శ్రీనివాస్‌, బట్ట లక్ష్మీనారాయణ, కంది మహేష్‌, రవి, వెంకన్న, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-20T07:03:04+05:30 IST