‘జనాభా నియంత్రణ చట్టం’ అత్యావశ్యకం : గిరిరాజ్ సింగ్

ABN , First Publish Date - 2020-07-11T22:28:15+05:30 IST

అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే దేశంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత

‘జనాభా నియంత్రణ చట్టం’ అత్యావశ్యకం : గిరిరాజ్ సింగ్

న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే దేశంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ అనేది ఓ ఛాలెంజ్ అని, దీనికి కఠిన చట్టాలు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు.


‘‘జనాభా పెరుగుదల ఓ ఛాలెంజ్. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలంటే జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఏ మతం వారైనా సరే... దానిని నిక్కచ్చిగా, కఠినంగా అమలు చేసేలా ఉండాలి’’ అని పేర్కొన్నారు.


1979 లో చైనా గనుక నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే... మరో 60 కోట్ల జనాభాతో చైనా నిండిపోయేదని వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణే చైనా అభివృద్ధికి ఓ టర్నింగ్ పాయింట్ అని తెలిపారు. జనాభా నియంత్రణ అనేది దేశ అభివృద్ధికి సంబంధించినదని, దానిని రాజకీయం చేయడం తగదని గిరిరాజ్ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-07-11T22:28:15+05:30 IST