అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, చైర్‌పర్సన్‌ దీపిక తదితరులు


  • కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
  • పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలి
  • మేడ్చల్‌లో ఇంటిగ్రేటేట్‌ వెజ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులకు శంకస్థాపన

 మేడ్చల్‌, మే 21 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధ్దిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, అభివృద్ధ్దిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌ డాగ్‌ బంగ్లాలో శనివారం రూ. 4.5 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటేట్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల సారఽథ్యంలో మేడ్చల్‌లో ఐటీ పార్కు ఏర్పాటుతో లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు మున్సిపాల్టీల్లో అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించే పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులందరూ చురుకుగా పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ప్రతీ మున్సిపాల్టీలో ఇంటిగ్రేటేట్‌ మార్కెట్‌, వైకుంఠధామం, ప్రకృతివనాలు ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి మేడ్చల్‌ కిందిబస్తీలో టీఆర్‌ఎస్‌ నాయకుడు రఘుగౌడ్‌ నిర్మించిన కమాన్‌ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికనర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌, కమిషనర్‌ షపీఉల్లా, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివా్‌సరెడ్డి, స్వామి, దేవ, గణేష్‌, శేఖర్‌గౌడ్‌, భాస్కర్‌యాదవ్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST