అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-01-27T04:59:57+05:30 IST

జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భం గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి ఆయ న మాట్లాడారు. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించి గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ఈ ఏడాది 2.85లక్షల ఎకరాల్లో సాగు

 సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 26: జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భం గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి ఆయ న మాట్లాడారు. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించి గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. జిల్లాలో సంక్షేమ ఫలాలను అర్హులైన అందరికీ అందిస్తున్నామన్నారు. ప్రధానంగా వ్యవసాయం, విద్య, నీటిపారుదల, వైద్య రంగాల్లో పురోగతితోపాటు, రెండు పడకగదుల ఇళ్లు, స్వచ్ఛభారత్‌, హరితహారం, విద్యుత్‌, మిషన్‌ భగీరథ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌ యంత్రాంగం పాటుపడుతోందని కొనియాడారు. ఈ ఏడాది జిల్లాలో యాసంగిలో 2.85లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయని తెలిపారు. రైతు బీమా కింద 1502 మంది రైతుల నామినీలకు రూ.75.10కోట్లు చెల్లించామన్నారు. రుణమాఫీ కింద ప్రస్తుత ఆర్థి సంవత్సరంలో 14, 600 మంది రైతులకు రూ.18.25కోట్ల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 19,09,44మందికి రూ.167.34కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌, అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, సూర్యాపేట, కోదాడ డీఎస్పీ ఎస్‌.మోహన్‌కుమార్‌, రఘుతో పాటు పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత కలెక్టర్‌ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించా రు. పోలీసుల కవాతులో ఏఆర్‌, సివిల్‌, హోంగార్డులు, ఎన్‌సీసీ విభాగాలకు చెందిన నాలుగు ప్లటూన్లు పాల్గొన్నాయి. అనంతరం వివిధ శాఖల స్టాళ్లను కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. ఉత్తమ ప్రతిభచాటిన పలు శాఖల అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - 2021-01-27T04:59:57+05:30 IST