మందులు కావాలా.. వివరాలు చెప్పాల్సిందే!

ABN , First Publish Date - 2020-06-07T07:48:48+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వైరస్‌ సోకిన వారిని గుర్తించేందుకు

మందులు కావాలా.. వివరాలు చెప్పాల్సిందే!

మెడికల్‌ షాపుల్లో నమోదు  

కరోనా కట్టడికి ప్రత్యేక యాప్‌ 


ఒంగోలు నగరం, జూన్‌ 6 : కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వైరస్‌ సోకిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జలు బు, దగ్గు, జ్వరానికి సంబంధించిన మందులను కొనుగోలు చేసే వారి వివరాల సేకరణకు ప్రత్యేక యా ప్‌ను రూపొందించింది. దానికి ఫార్మసీ యాప్‌గా నామ కరణం చేసింది.


మందుల దుకాణాలకు వెళ్లి సిట్రజన్‌, యాంటీబయాటిక్‌, పారాసెట్మాల్‌ వంటి మాత్రలను కొనుగోలు చేసేవారు తమ వివరాలను తప్పనిసరిగా  దుకాణదారుడికి చెప్పాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు, పూర్తిపేరు, సెల్‌ఫోన్‌ నంబర్‌, ఏ ఊరు తదితర వివరాలను మందుల దుకాణంలో అందజేయాల్సి ఉంటుంది. వాటిని దుకాణదారుడు యాప్‌లో నమోదు చేస్తారు. ఆ వెంటనే మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారం వెళ్లింది. దీంతో ఆయన కొనుగోలుదారు ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకుంటారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా జిల్లాలో ఏ మెడికల్‌ షాపులో మందులు కొనుగోలు చేసినా వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేస్తున్నారు. 


మరో వైపు సర్వే

రాష్ట్రప్రభుత్వం కరోనా పాజిటివ్‌ రోగులను జల్లెడ పట్టేందుకు అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఫీవర్‌ సర్వే నిర్వహిస్తోంది. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి జలుబు, దగ్గు, జ్వ రం లక్షణాలు ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే  మెడికల్‌ ఆఫీసర్లు  క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అక్కడ పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వస్తేనే ఇంటికి పంపిస్తున్నారు. 

Updated Date - 2020-06-07T07:48:48+05:30 IST