వరద నష్టంపై అంచనా వేయరా?

ABN , First Publish Date - 2022-08-09T09:59:04+05:30 IST

వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనా వేయలేదని, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో మంరిత నష్టం జరిగే అవకాశాలున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

వరద నష్టంపై అంచనా వేయరా?

ముందస్తు చర్యల్లో సర్కార్‌ విఫలం: భట్టి 

మునుగోడులో కాంగ్రెస్‌దే గెలుపు: దుద్దిళ్ల


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనా వేయలేదని, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో మంరిత నష్టం జరిగే అవకాశాలున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. సోమవారం సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులతో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల సమయంలో గత ప్రభుత్వాలు అప్రమత్తమై వెంటనే చర్యలు చేపట్టేవని తెలిపారు. మంగళవారం నుంచి 15వ తేదీ వరకు జిలాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి రెండు రోజుల పాటు భద్రాచలంలో సీఎల్పీ బృందం వదర ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్సే గెలుస్తుందని, గత మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పారు. వర్షంలోనూ విధులు నిర్వహిస్తూ మరణించిన ఓ జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని, ఇక సామాన్యుల గతేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గోవు లాంటిదని, బీజేపీ పులి లాంటిదని గతంలో రాజగోపాల్‌ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. పాలిచ్చే, పూజించే గోవులాంటి కాంగ్రె్‌సను వదిలి, పులి లాంటి బీజేపీలోకి వెళ్లి రాజగోపాల్‌ ఏం సాధిస్తారని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ ఎవరి సొంతం కాదు.. పార్టీని నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు.

Updated Date - 2022-08-09T09:59:04+05:30 IST