రెండేళ్ల తర్వాత ఈ దీవుల్లో Covid First Case

ABN , First Publish Date - 2021-12-04T15:38:58+05:30 IST

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కుక్ దీవుల్లో శనివారం మొట్టమొదటి కొవిడ్ -19 పాజిటివ్ కేసు వెలుగుచూసింది....

రెండేళ్ల తర్వాత ఈ దీవుల్లో Covid First Case

వెల్లింగ్టన్:కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కుక్ దీవుల్లో శనివారం మొట్టమొదటి కొవిడ్ -19 పాజిటివ్ కేసు వెలుగుచూసింది. దక్షిణ పసిఫిక్ దేశం తన సరిహద్దులను పర్యాటకుల కోసం తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా కేసు బయటపడింది.ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందినా ఈ ద్వీప దేశంలో మాత్రం ప్రబలలేదు. దాదాపు 17,000 మంది జనాభా ఉన్న దక్షిణ పసిఫిక్ ప్రపంచంలోనే అత్యధిక టీకాలు వేయించుకున్న దేశంగా నిలచింది. జనాభాలో 96 శాతం మంది డబుల్ డోస్‌ టీకాలు వేయించుకున్నారు.గురువారం తన కుటుంబంతో విమానంలో వచ్చిన తర్వాత నిర్బంధంలో ఉన్న 10 ఏళ్ల బాలుడిలో కరోనా వైరస్ ఉందని తేలిందని ప్రధాన మంత్రి మార్క్ బ్రౌన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలుడు న్యూజిలాండ్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ద్వీప దేశంలో మొదటి కరోనా కేసు వెలుగుచూడటంతో ఆ ద్వీపం అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన బాలుడిని ఐసోలేషన్ కు తరలించారు.


Updated Date - 2021-12-04T15:38:58+05:30 IST