అమెరికాలో 25 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి

ABN , First Publish Date - 2021-04-19T05:10:49+05:30 IST

అమెరికా జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతుమందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాల ద్వారా తెలుస్తోంది. సీడీసీ డ్యాష్‌బోర్డు ప్ర

అమెరికాలో 25 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి

వాషింగ్టన్: అమెరికా జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతుమందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాల ద్వారా తెలుస్తోంది. సీడీసీ డ్యాష్‌బోర్డు ప్రకారం 26,44,99,715 కొవిడ్ వ్యాక్సిన్ మోతాదులను పంపిణీ చేయగా, శనివారం నాటికి 20,58,71,913 మందికి వ్యాక్సిన్ వేశారు.


వీరిలో 12,94,94,179 మంది ఒక్క డోసు తీసుకోగా, 8,24,71,151 మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశ జనాభాలో 39 శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు డ్యాష్‌బోర్డు ద్వారా తెలుస్తోంది. అలాగే, 24.8 శాతం మంది రెండు డోసులూ వేయించుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 


Updated Date - 2021-04-19T05:10:49+05:30 IST